ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. బాధితులకు భరోసా కల్పించిన సీపీ అంబర్ కిషోర్ ఝా….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం : ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో సీపీ నేరుగా మాట్లాడి, ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వానికి తావు ఉండకూడదని అధికారులకు సీపీ స్పష్టం చేశారు.
ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం, భరోసా కల్పించే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
