సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్‌

Sakshitha news

గాజులరామారం డివిజన్‌లో రూ.99.50 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్‌

హైదరాబాద్, ఆగస్టు 23: కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు ఆధ్వర్యంలో గాజులరామారం డివిజన్ పరిధిలో ఆదివారం సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. బాలాజీ లేఔట్‌లో రూ.14 లక్షలు, వొక్షిత్ ఎంక్లేవ్‌లో రూ.40.50 లక్షలు, వీనస్ ఎంక్లేవ్‌లో రూ.45 లక్షల చొప్పున మొత్తం రూ.99.50 లక్షల నిధులతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ.. గాజులరామారం డివిజన్‌లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా కాలనీల్లో రహదారుల సమస్యలను పరిష్కరించేందుకు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబుకు గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాను మంజూరు చేయించిన రోడ్ల పనులపై స్థానికంగా రాజకీయ ప్రచారం జరుగుతోందని కూన శ్రీశైలం గౌడ్ గారు విమర్శించారు. తాను మంజూరు చేయించిన రోడ్లను ప్రస్తుత ఎమ్మెల్యే మంజూరు చేసినట్లుగా రోడ్ల వెంట తిరుగుతూ శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.

ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు నిధులు లేవంటూ విమర్శలు చేస్తూనే, మరోవైపు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించడం ప్రజలను అయోమయానికి గురిచేసే విధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనుల విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

గాజులరామారం డివిజన్‌లో రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటానని కూన శ్రీశైలం గౌడ్ గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆంజనేయలు స్థానిక నాయకులు యాము సాగర్, లక్ష్మీ నారాయణరెడ్డి, కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు ప్రతినిధులు, అంజన్న, గోపాల్ రెడ్డి, వల్లెపు వేణు కుమార్, సురపరాజు, వెంకట్రావు, వెంకట్ రెడ్డి, శివ, కిరణ్, సురేష్ కుమార్, జగదీష్, నాగరాజు, కిరణ్, ఋషి కుమార్, శ్రీకాకుళం రవి, వెంకటేశ్వరరావు, అమ్రేష్, శశిధర్, దీపక్, సత్యనారాయణ, రామనాథరెడ్డి, రాఘవేంద్ర, రంగారెడ్డి, గోపి, ప్రతాపరెడ్డి, వివేక్, ఆనందరావు, మహేందర్, శ్రీపాల్ రెడ్డి మరియు స్థానికులు తదితరులు పాల్గొని సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుభాకాంక్షలు తెలిపారు

Scroll to Top