అనారోగ్యంతో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు నాగేళ్ల సంగీత బాబు ని పరామర్శించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు .
మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్-ఛార్జ్ శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు పార్టీ సీనియర్ నాయకులు నాగేళ్ల సంగీత బాబు నివాసానికి వెళ్ళారు.
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగీత బాబు ని వెలంపల్లి శ్రీనివాసరావు స్వయంగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY