ఇంద్రకీలాద్రిపై భద్రతా, పార్కింగ్ ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు ఆలయ ఈవో శ్రీ సినా నాయక్ స్పెషల్ గే డిప్యూటీ కలెక్టర్ వారితో ప్రత్యేక పరిశీలన :
భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రాక రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా, ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. కొండపై ప్రధాన ఆలయం, పరిసర ప్రాంతాలు, ఘాట్ రోడ్డుతో పాటు పలు కీలక ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.
ఇంద్రకీలాద్రి కొండపై పలు ప్రాంతాలలో వాహనాల పార్కింగ్‌కు అనుకూలమైన ప్రదేశాలను పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యటన సందర్భంగా అదనపు డీసీపీలు, ఏసీపీలు, వన్‌టౌన్ సీఐతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం దేవస్థానం అధికారులతో సీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై సమీక్ష చేశారు. పరిశీలన అనంతరం శ్రీ రాజశేఖర్ బాబు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY