గాజులరామారం సర్కిల్ ఉప కమిషనర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి సర్కిల్ అధికారులకు మరియు ఉద్యోగులకు తగు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారము కార్యక్రమాలు నిర్వహించి హెడ్ ఆఫీస్ వారు నిర్దేశించిన ఫార్మాట్లలో రిపోర్టులు సబ్మిట్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ అధికారులు మరియు సర్కిల్ అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు యు సి డి ఆర్ పి లు మరియు అంగన్వాడి టీచర్లు పాల్గొనడం జరిగింది.
గాజులరామారం సర్కిల్ పరిధిలో బాలయ్య బస్తి మరియు VSR CELESTIAL TOWERS ఏరియాలో ఫ్రైడే డ్రైడే లోభాగంగా దోమల నివారణ కొరకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీపాధ రామేశ్వర్ , అధికారులు మరియు సిబ్బంది కాలనీ వాసులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
