ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు….
కోదాడలో ‘శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్’ ప్రారంభం..
సాక్షిత : మహిళల స్వయం ఉపాధికి ప్రోత్సాహం
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం కింద కోదాడ పట్టణంలో మరో స్వయం ఉపాధి కేంద్రం ప్రారంభించారు. కోదాడ పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ బజార్లో శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ ను కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఏ. రమాదేవి లు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.పట్టణంలో ప్రారంభమైన శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు స్థానిక ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు.
మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావాలని, స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని నాయకులు సూచించారు.ఇలాంటి వ్యాపారాల ద్వారా మహిళలు స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు సమాజంలో తమ స్థానం మరింత బలపరుచుకుంటారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మూడో వాడు కౌన్సిలర్ వంగూరీ గోపి, నాలుగో వార్డ్ కౌన్సిలర్ సుల్తానీ సుజాత రాంబాబు, మెప్మా సీఓ వెంకన్న, సి ఎల్ ఆర్ పి రాణి, నిర్వాహరాలు బచ్చలకూర అనూష ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY