అల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ ఫేస్ 2 కాలనీలో డ్రైనేజీ పొంగి సమస్యగా ఉందని కాలనీ ప్రజలు శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ ని డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని కలిసి సమస్యను వివరించడం జరిగింది. ఎమ్మెల్యే మరియు మాజీ కార్పొరేటర్ ఆదేశాల మేరకు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ కాలనీలో పర్యటించి ఎయిర్ టెక్ యంత్రంతో డ్రైనేజీ లైన్ ను దగ్గరుండి క్లియర్ చేయించి సమస్యను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా కాలనీ లో ఉన్న చిన్న డ్రైనేజీ లైన్ తో సమస్య ఏర్పడుతుందని, నూతన డ్రైనేజీ లైన్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే మరియు మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లి నూతన డ్రైనేజీ లైన్ మంజూరు చేయిస్తామని యువనేత కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY