BRS పార్టీ యువ నాయకులు గడిల బాబు మరియు శంభిపూర్ రవిరాజ్ ల శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్స్ సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్లో స్థానిక యువకులు నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్స్ నూతన కార్యాలయాన్ని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, యువత వ్యాపార రంగంలో ముందుకు రావడం అభినందనీయమని, ఇటువంటి సంస్థలు స్థానికంగా ఉపాధి అవకాశాలు సృష్టించి ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సంస్థ యాజమాన్యం మరియు స్థానిక నాయకులు కలిసి ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ని శాలువాతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్.వి. రవీందర్ రెడ్డి , భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, BRS పార్టీ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి , ధర్మారెడ్డి , మురళీ యాదవ్ , చింత మల్లేష్ , శంభిపూర్ నగేష్ , మన్నే బలరాజ్ అలాగే సంస్థ యాజమాన్యం గడిల బాబు, శంభిపూర్ రవిరాజ్, శ్రీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
