ఎడ్లపాడు మండలం, లింగారావుపాలెం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ మరియు 9వ తరగతులకు చెందిన 40 మంది విద్యార్థులు 25-02-2026 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలను వీక్షించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశంతో విద్యార్థులు అమరావతిలోని వెలగపూడి శాసనసభ ప్రాంగణాన్ని సందర్శించి, అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు.ఈ సందర్భంగా విద్యార్థులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని మర్యాదపూర్వకంగా కలుసుకొని, ఆయనతో కలిసి ఫోటోలు దిగారు.
అలాగే శాసనసభ కార్యక్రమాలు మరియు ప్రజాస్వామ్య విధానాలపై విద్యార్థులు అవగాహన పొందారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
