సిద్దిపేట జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగు (42) కేంద్రాల వద్ద 163 BNSS 2023 సెక్షన్ అమలు
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ తేదీ: 25-02-2026 నుండి 18-03-2026 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలో వున్న (42) పరీక్ష కేంద్రల వద్ద 163 BNSS 2023 సెక్షన్ విదించనైనది, తేది 25-02-2026 నుండి 18-03-2026 వరకు ఉదయం 07:00 నుండి మధ్యాహ్నం 02:00 గం: వరకు అమల్లో ఉంటుంది. మరియు పరీక్షలు జరుగు సమయంలో సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని, మరియు పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 200 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటారని పోలీస్ అధికారులు పరిక్ష సమయంలో పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షా సమయానికే గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కమిషనర్ గారు సూచించారు.
కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY