జిల్లాకు పథకాల పంట.
పోలీస్ క్రీడల్లో జిల్లాకు 8 పథకాలు.
బ్యాట్మెంటన్ సింగిల్స్ లో రజత పథకం సాధించిన డి.ఎస్.పి కె ఇంద్రవర్ధన్.
పోలీస్ క్రీడల్లో పథకాలు సాధించిన 3 మహిళా కానిస్టేబుళ్లు.
400, 800 మీటర్ల పరుగులో స్వర్ణ పథకాన్ని సాధించిన ఏ ఆర్ కానిస్టేబుల్ పి పూజ.
యోగాలో బంగారు, కాంస్య పథకాలు సాధించిన మహిళ కానిస్టేబుల్ రూప.
70 కేజీల కేటగిరి బాడీ బిల్డింగ్ లో కాంస్య పథకం
జిల్లాకు మూడు బంగారు, నాలుగు కాంస్య, ఒక రజత పథకం.
జాతీయస్థాయిలో పోటీపడి జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచాలని సూచించిన జిల్లా ఎస్పీ.
అభినందించి, అవార్డులను అందజేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
గతవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర పోలీసు గేమ్స్ మరియు స్పోర్ట్స్ మీట్ లో ఆదిలాబాద్ జిల్లా కు సంబంధించిన మహిళా కానిస్టేబుళ్లు అద్భుత ప్రదర్శన ప్రదర్శించి 400 మీటర్స్, 800 మీటర్ల పరుగులో 2 స్వర్ణ పథకాలను ఏఆర్ కానిస్టేబుల్ పి పూజ సాధించింది. యోగ నందు జిల్లాకు చెందిన రూపా అనే మహిళా కానిస్టేబుల్ రెండు కేటగిరీల నందు బంగారు మరియు కాంస్య పథకాలను సాధించింది. ముఖ్యంగా బ్యాట్మెంటన్ సింగిల్స్ నందు ఏఆర్ డిఎస్పి కమతం ఇంద్ర వర్ధన్ అద్భుతమైన ప్రదర్శన కల్పించి రాష్ట్రస్థాయిలో రజత పథకాన్ని సాధించారు.
అదేవిధంగా 4*100 రిలే పరుగులు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇద్దరితో కలిసి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళ కానిస్టేబులు పి పూజ మరియు ఎం రోహిని లు కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది. జిల్లా పోలీసు కీర్తి ప్రతిష్టలను శిఖర స్థాయికి మహిళా పోలీసు సిబ్బంది చేర్చడం గమనార్ధం. ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయం నందు పథకాలను అందుకున్న క్రీడాకారులను జిల్లా ఎస్పీ ఆహ్వానించి ప్రశంసా పత్రాలను, పథకాలను అందజేసి భవిష్యత్తులో జిల్లా కీర్తి ప్రతిష్టలను మరింత పెంచేలా కృషి చేయాలని తెలిపారు. పథకాలను పొందిన అధికారులను, కానిస్టేబుళ్లను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా 70 కిలోల క్యాటగిరిలో బాడీ బిల్డింగ్ నందు రూప్ సింగ్ అనే కానిస్టేబుల్ కు కాంస్య పథకం లభించింది. భవిష్యత్తులో రాష్ట్రస్థాయిలో మరియు జాతీయస్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జిల్లా పోలీసు స్థాయిని కీర్తిని శిఖర స్థాయికి చేర్చాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డి.ఎస్.పి కమతం ఇంద్ర వర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకటి, సిసి కొండరాజు , కానిస్టేబుల్ రూప, రోహిణి, మీర్ సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
