ఆకుపాటి ఆధ్వర్యంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
కనిగిరి సాక్షిత:
కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణ రెండవ ఎంపీటీసీ సభ్యులు, ప్రకాశం జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు ఆకు పాటి వెంకటేష్ ఆధ్వర్యంలో బెంగుళూరు బి నారాయణపురంలోని జిఎంఆర్ పీజీ నందు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా కర్ణాటక రాయల్ పీపుల్స్ ఫ్రెంట్ అధ్యక్షులు మంజునాథ రాయల్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంజునాథ రాయల్ మాట్లాడుతూ స్వయంకృషితో సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా, బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతోమందికి రక్తదానం అందించి, ప్రజాసేవలో సైతం మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు మహేంద్ర, పాలపర్తి రాంబాబు, ఆకుపాటి మిత్రబృందం పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
