డ్రిప్ ఫ్యాక్టరీని సందర్శించిన
ఆలంపూర్ శాసనసభ్యులు విజయుడు
అలంపూర్
సాక్షిత:
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి కీ సంబందించి కొన్ని కోట్ల రూపాయల విలువైన పరమేశ్వర్ డ్రిప్ ఫ్యాక్టరీ పూర్తిగా మంటల దాగిదగ్ధమైంది.ఈ దుర్ఘటన తెలుసుకున్న,
ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు,అయిజ మండల బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వావిలాల రంగారెడ్డి,అయిజ మున్సిపాలిటీ చైర్మన్ సీఎం సురేష్ తక్షణం స్థలానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రతాప్ రెడ్డి ని, కుటుంబ సభ్యులను పరామర్శించి, మంటల్లో దగ్ధమైన ఫ్యాక్టరీని స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ:
“కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కష్టపడి నిర్మించిన ఈ ఫ్యాక్టరీ మంటలకు బలైపోవడం అతి బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, అలంపూర్ నియోజకవర్గంలో అగ్నిమాపక ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, అధికారులను కోరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY