హనుమకొండ DCC అధ్యక్షులు మరియు కుడా (KUDA) ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కోడవటంచ (కోటంచ) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానం మేరకు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కోడవటంచ (కోటంచ) లక్ష్మీనరసింహస్వామి పున:ప్రతిష్టా మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా హనుమకొండ DCC అధ్యక్షులు మరియు కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి , కుడా పివో అజిత్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనతరం ఎమ్మెల్యేతో పాటు ఆలయ ఛైర్మన్ నాయినేని సంపత్ రావు తో కలిసి ఆలయ పునర్నిర్మాణ పనులను, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నారు.
ఈ ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం సుమారు ₹82.25 కోట్ల నుండి ₹86.30 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసి “తెలంగాణ రెండవ యాదాద్రి”గా తీర్చిదిద్దారు. నూతన గర్భాలయం, అతిథి గృహాలు, అంతర్గత రహదారులు మరియు భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ వంటి వసతులను కల్పించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY