వర్ధన్నపేట మున్సిపాలిటీ – చైర్మన్, వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు గారు…
వరంగల్ జిల్లా / వర్ధన్నపేట
వరంగల్ జిల్లా పరిధిలోని వర్ధన్నపేటలో మున్సిపల్ చైర్మన్‌గా పాలకుర్తి సారంగపాణి గారు, వైస్ చైర్మన్‌గా నేతావత్ శీభారాణి–రాజేందర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ చేత పదవి స్వీకారం చేయించి, శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు…
తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు పూజా కార్యక్రమాలు నిర్వహించగా వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, వర్ధన్నపేట పట్టణ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం మరియు సమర్థవంతమైన పాలనతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి వర్ధన్నపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు, సహకరించిన కౌన్సిలర్లకు చైర్మన్ సారంగపాణి కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో బెజ్జం పాపారావు, నూనవత్ కమిలి, మాలోత్ దేవేందర్, చిలువేరు రమ, తుమ్మల అరుణ, తిరుపెల్లి వాణి, మున్సిపల్ చైర్మన్ సుధీర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, పట్టణ అధ్యక్షుడు మైస సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజీరెడ్డి, టౌన్ మరియు మండల నాయకులు, యువత, మహిళలు, జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY