చుక్క సత్యం సంస్కరణ సభలో సిపిఎం ఘన నివాళి
సాక్షిత వనపర్తి ఫిబ్రవరి 19
అమరజీవి కామ్రేడ్ సుక్క సత్యం సంస్కరణ సభ రాయి గడ్డ వారి స్వగృహం లో డి. కురుమయ్య అధ్యక్షతన గురువారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించడంజరిగింది.
చుక్క సత్యం చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి సిపిఎం పార్టీ ఘన నివాళి అర్పించింది.
అనంతరం చుక్క సత్యం సంస్మరణ సభ సందర్భంగా సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి ఏ రాములు, సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి. జబ్బార్, సిపిఎం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ కార్యదర్శి కిల్లె గోపాల్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సీనియర్ నాయకులు ఆర్. రామ్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.
సుక్క సత్యం జీవిత విశేషాలను వివరించారు. చుక్క సత్యం నిరుపేద కుటుంబంలో పుట్టి కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితుడై మరణించేదాకా కమ్యూనిస్టు సిద్ధాంతం అజేయమని నమ్మిన ముఖ్యమైన నాయకుడని చుక్క సత్యం కమాన్ రాయిగడ్డ దగ్గర చిన్న టీ హోటల్ పెట్టుకొని జీవిస్తూ సిపిఎం పార్టీ దినపత్రిక ఇలా ప్రజాశక్తి పత్రికను వేయించుకొని ప్రజలకు సిపిఎం రాజకీయాలను వివరించేవారని కొనియాడారు.
చుక్క సత్యం అన్నదమ్ములు అంతా సీపీఎం పార్టీ నాయకులని చుక్క నాగన్న,చుక్క బాలస్వామి, చుక్క సత్యం,చుక్క రామన్న కుటుంబ సభ్యులు సిపిఎం పార్టీ సభ్యులుగా, కార్యకర్తలుగా పని చేశారని వివరించారు.
నేడు అవును మార్క్సిజం – లె ని నిజం లేదన్న పెట్టుబడిదారుల కలలు కల్లలయ్యాయి
మార్క్సిజం, లేని నిజం ప్రపంచంలో ముందుకు వస్తున్నదని వివరించారు.
భారతదేశంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో కామ్రేడ్ పినరై విజయన్ ముఖ్యమంత్రిగా కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తుందని వివరించారు. ప్రపంచంలో చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తరకొరియా, లావోస్ దేశాలలో సోషలిస్టు సమాజాలు కొనసాగుతున్నాయన్నారు.
శ్రీలంకలో ఇటీవల కాలంలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారని వివరించారు. భవిష్యత్తు సోషలిజం అని ఎర్రజెండావే భవిష్యత్తు అని అన్నారు.
ఈ సభలో సిపిఎం 18 వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్, మాజీ సిపిఎం కౌన్సిలర్ వి.నాగేశ్వర్, చుక్క నారాయణమ్మ మాజీ కౌన్సిలర్,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.రాజు, సిపిఎం పట్టణ నాయకులు గంధం గట్టయ్య, బి.కురుమయ్య, బీ సన్న,, సి పుల్లయ్య, ఏ. రమేష్, జి. బాలస్వామి, సుక్క పెంటన్న, దాసరి పెంటయ్య, చుక్క సత్యం గారి పెద్ద కుమారుడు సినిమా యాక్టర్ చుక్క జితేంద్ర, వందన సమర్పణ చేశారు.
ఈ సభలో చుక్క రాజు,చుక్క సుందర్, ఒకటో వార్డు కౌన్సిలర్ చుక్క జయశ్రీ, చుక్క సత్యం తమ్ముడు చుక్క రాములు, ఎన్. పురుషోత్తం అడ్వకేట్, ఎస్. నారాయణ, బి.నరేందర్,జన జ్వాల రాధాకృష్ణ,సాహితీ కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
చుక్క సత్యం సంస్కరణ సభలో సిపిఎం ఘన నివాళి

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY