నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు 2వ దశ శిక్షణా కార్యక్రమం…
సాక్షిత పెద్దపల్లి : పెదపల్లి లోని మదర్ థెరెసా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు 2వ. దశ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ శిక్షణా కార్యక్రమంలో అంతర్గాం, ధర్మారం, ఎలిగేడ్, జూలపల్లి, రామగిరి, మంథని మరియు ముత్తారం మండలాల నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ముఖ్యఅతిథిగా హాజరైనారు. శిక్షకులుగా గా డీఎల్‌పీఓ పెదపల్లి శ్రీమతి దేవకి దేవి, డీఎల్‌పీఓ మంథని కొమురయ్య, ఏపీడీ సత్యనారాయణ, సంబంధిత మండల పంచాయతీ అధికారులు, ఎస్‌బీఎం రాఘవులు, ఈసీ అయూబ్ ఖాన్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, పంచాయతీ పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన నిర్వహణకు కృషి చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వము సమస్త సర్పంచులకు చట్టం పైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల పైన ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని 5 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఏడు మండలాల సర్పంచులు తప్పకుండా ఐదు రోజులు హాజరై ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరనైనది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY