ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలానీ ఆదేశించిన….. అదనపు కలెక్టర్ యాదయ్య
సాక్షిత వనపర్తి
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆదేశించారు.
ఐడి ఓసీలోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఇంటర్ పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను తప్పనిసరిగా తనిఖీలు చేసి పరీక్ష హాల్లోకి అనుమతించాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ లు పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు. సెల్ ఫోన్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఎట్టి పరిస్థితిలో పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని, ఎవరూ తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీ సీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు వాచ్ లు అనుమతించకపోవడం వలన ప్రతీ పరీక్ష హాలులో గోడ గడియారాలు అమర్చాలని తెలిపారు.
పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో చేరుకునేలా సూచనలు చేయాలని తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల కోసం 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాల ద్వారా 6,216 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 6,437 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 10 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయని తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన మంచినీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు మౌలిక సదుపాయాలు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశం లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY