కొత్తగూడెం స్ఫూర్తితో గుట్టలో ఎర్రజెండాను ఎగురవేయడం ఖాయం.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి ప్రజలు సిపిఐ ని కోరుకుంటున్నారని దానికి నిదర్శనం కొత్తగూడెం కార్పొరేషన్ లో ఏ పార్టీలతో పొత్తు లేకుండా సిపిఐ ఒంటరిగా పోరాటం చేసి 60 సీట్ల గాను 23 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా ఏర్పడిందని దాన్ని గుర్తించి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బి ఆర్ ఎస్ పార్టీ కొత్తగూడెంలో మేయర్ ఎన్నికలకు సిపిఐ కి సంపూర్ణ మద్దతును తెలియజేసిందని ఈ గెలుపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులకు స్ఫూర్తిదాయకమైనదని అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ విజయం సాధించినందుకు జగద్గిరిగుట్ట కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకొని విజయోత్సవ సంబరాలను నిర్వహించడం జరిగింది, ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్,టీఆర్ఎస్, బిజెపి పార్టీలు ఓటర్లకు లక్షలాది రూపాలను పంచినప్పటికీ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతోనే సిపిఐ పార్టీ ఉన్నందువల్ల ప్రజలు డబ్బుకు కులానికి మతానికి లొంగకుండా సిపిఐ పార్టీకి ఓటు వేసి గెలిపించారని అన్నారు.
జగద్గిరిగుట్ట లో కూడా సిపిఐ ప్రజల నాలుకలో నిత్యం ఉంటూ అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాడి విజయం సాధించిందన, ఇవాళ జగద్గిరిగుట్టలో బస్తీ దావఖానా, రోడ్డు వెడల్పు, ప్రభుత్వ వైద్యశాల లాంటివి ఏర్పాటు కోసం పోరాటం చేసి విజయం సాధించిందని అదేవిధంగా పరికిచెరువు పరిరక్షణ కొరకు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భూముల పరిరక్షణ కొరకు, బస్ డిపో ఏర్పాటు కొరకు సిపిఐ పోరాటాలను నిర్వహిస్తున్నదని అందుకే రానున్న ఎన్నికల్లో జగద్గిరిగుట్ట ప్రజలు కూడా సిపిఐ ని గెలిపిస్తారని అన్నారు. సిపిఐ పార్టీని గెలిపించడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పని చేయాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు, రాములు శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి ఏఐవైఎఫ్ కార్యదర్శి వెంకటేష్ ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు సిపిఐ నాయకులు సదానంద్, కే వెంకటేష్, ఏం సహదేవరెడ్డి, ఏ కృష్ణ, నాగేష్ చారి, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ చారి, సామిల్,రవి, జానకి రామ్, ఇమామ్, నారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY