చరిత్రలో నిలిచిపోయే ప్రజా బడ్జెట్
** చిత్తూరు జిల్లా టీడీపీ రాష్ట్ర నాయకులు
సాక్షిత ప్రతినిధి – పూతలపట్టు: ఇది చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్ అని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, చిత్తూరు నియోజకవర్గం టిడిపి నాయకులు సప్తగిరి ప్రసాద్, మోహన్ రాజ్ లు అన్నారు. 2026-2027 బడ్జెట్ గతంలో ఎప్పుడూ లేనివిధంగా 3 లక్షల 32వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టి భారత దేశంలోనే ఒక సంచలమైన బడ్జెట్ అని ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు కొనియాడారు. ముఖ్యంగా గత సంవత్సరం గత వార్షిక బడ్జెట్ 2,92,000 కోట్ల రూపాయలకి ప్రవేశపెడితే ఈసారి 3లక్షల 32 వేల కోట్ల రూపాయలు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టడం జరిగింది. అందులో సూపర్ సిక్స్ పథకానికి అగ్రపీఠం వేస్తూ ఎన్నికల హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకానికి కూడా పెద్ద ఎత్తున కేటాయించడం పట్ల నాయకులు సంతోషం, ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తల్లికి వందనం, డొక్కా సీతమ్మ పథకం, అదేవిధంగా పాఠశాల విద్యకు, వైద్య ఆరోగ్యశాఖకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. వ్యవసాయ శాఖకు ఎప్పుడు లేని విధంగా 11,118 కోట్ల రూపాయల కేటాయించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతుల పక్షపాతి ప్రభుత్వంగా నిలబడిందని అన్నారు. సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం ,మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమం కోసం భారతదేశంలో ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా బడ్జెట్ కేటాయించిందని అన్నారు.
ఇది మాటల ప్రభుత్వం కాదు…చేతల ప్రభుత్వమని నిరూపించారు. అదేవిధంగా శాంతి భద్రతలను కాపాడడం కోసం పోలీసులకు 3000 వాహనాలు కేటాయించడం కోసం బడ్జెట్ రూపకల్పన చేయటం, అదే విధంగా డిజిటల్ అరెస్టులను, ఆన్లైన్ మోసాలు అరికట్టడం కోసం ప్రతి జిల్లాకి సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ,పోలీస్ అకాడమీ ఏర్పాటు చేయడానికి 94 ఎకరాల ప్రభుత్వ భూమి మరియు తొలి దశలో 15 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించి పోలీసు శాఖకి పెద్దపీట వేయడం జరిగింది అని అన్నారు. ప్రజల శాంతి భద్రతలను ధనమాన ప్రాణాలు రక్షించడమే మన ప్రభుత్వం ప్రధాని ధ్యేయంగా బడ్జెట్ ఉందని అన్నారు. అదేవిధంగా బడ్జెట్ పైన అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇంత పెద్ద రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా సాహసోపితమైన బడ్జెట్ ని కేటాయించినందుకు చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ లో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, టిడిపి యువత కార్యదర్శి యువరాజు నాయుడు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY