శనివారం వచ్చిందంటే… నగర సంకీర్తన యాత్ర
** గోవింద నామాలతో పులకిస్తున్న భక్తజనం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో శనివారం వచ్చిందంటే పురవీధులు గోవింద నామాలతో మార్మోగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. వందమందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తు నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథ్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, అన్నా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పళని ఆచారి, ముని కోటిరెడ్డి, నరసింహారెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, మిట్టపల్లి బ్రహ్మానందం, శ్రావణి, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతకోటి మునికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, కల్పన, విగ్రహాల కళ్యాణి, సుకుమార్ రెడ్డి, వెంకట్రామయ్య, చిత్రపు హనుమంతరావు, మల్లారపు వాసు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY