ఉప్పల్ పెద్ద చెరువు
(హైకోర్టు కాలనీ -హెచ్ఎంటి చెరువు)కి మహర్దశ : మాజీ కార్పొరేటర్ బన్నాల గీత
30 కోట్ల నిధులతో హైకోర్టు కాలనీ హెచ్ఎంటి చెరువుకి మహార్దశ : మాజీ కార్పొరేటర్ బన్నాల గీత
ఫలించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషి : మాజీ కార్పొరేటర్ బన్నాల గీత
నాడు హైకోర్టు కాలనీ హెచ్ఎంటి నగర్ రోడ్డు సాధించే విషయంలో… బండారి రాజిరెడ్డి సక్సెస్
నేడు ఉప్పల్ పెద్ద చెరువు (హైకోర్టు కాలనీ హెచ్ఎంటి) 30 cr చెరువు సుందరీకరణ విషయంలో…
బండారి లక్ష్మారెడ్డి సక్సెస్
ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు : చిల్కానగర్ బీరప్ప గడ్డ డివిజన్, ప్రజలు
ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ పెద్ద చెరువు
( హైకోర్టు కాలనీ హెచ్ఎంటి చెరువు) చిల్కానగర్ డివిజన్ కి ఆనుకొని ఉన్న ఈ చెరువుకి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి కృషితో 30 కోట్ల రూపాయలు చెరువు సుందరీ కరణకు కేటాయించడం జరిగింది.
ఉప్పల్ ఎమ్మెల్యే కృషి ఫలించిందని చిల్కానగర్ డివిజన్ ప్రజల కోరిక ఆనాడు బండారి రాజిరెడ్డి నేడు బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ పెద్ద చెరువు సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని మాజీ కార్పొరేటర్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు.
ఇక చిల్కానగర్ డివిజన్ ప్రజలకు మరియు బీరప్ప గడ్డ డివిజన్ ప్రజలకు దోమల బెడద తో శాశ్వత పరిష్కారం జరుగుతుందని తొందరలో చెరువుని పూర్తిగా ఖాళీ చేసి మూడు ఫీట్ల పూడికతీత తీయించి చెరువు సుందరీ కరణ పనులు మొదలవుతాయని అన్నారు.
ఆనాడు చెరువుసుందరీకరణ విషయంలో మరియు ప్రజలకు హెచ్ఎంటి నగర్ వైపు మరియు హైకోర్టు కాలనీ వైపు ఉన్న ప్రజలకు రహదారి ఉండాలని ప్రయత్నం చేశారు,
ఈనాడు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి చెరువు సుందరీకరణను కూడా వారే చేపట్టడం చాలా అభినందనీయమని చిల్కానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారితో కలిసి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ చిల్కానగర్ డివిజన్ నాయకులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఉప్పల్ పెద్ద చెరువు హైకోర్టు కాలనీ హెచ్ఎంటి నగర్ చెరువుకి 30 కోట్ల నిధులు శాంక్షన్ చేసినందుకు వారికి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
