ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 77వ ఆవిర్భావ దినోత్సవం
చిలకలూరిపేటలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (A.P.E.E.U–1104)77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12-02-2026 ఉదయం ఓల్డ్ సబ్ డివిజన్ ఆఫీస్ RTC bus stand దగ్గర ప్రాంగణంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు M. కోటేశ్వరరావు , డివిజన్ కార్యదర్శి కే. వెంకటేశ్వరరావు యూనియన్ నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు.అధ్యక్షులు మాట్లాడుతూ 1104 యూనియన్ వేలాది విద్యుత్ కార్మికుల హక్కుల సాధన, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం దశాబ్దాలుగా పోరాడుతూ కార్మికులకు కామధేనువుగా నిలిచిందన్నారు. కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా కార్మికుల శ్రేయస్సు కోసం ఏర్పడిన సంఘమని గుర్తుచేశారు. గత త్యాగాల ఫలితంగానే నేటి హక్కులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల కోర్టు విషయమై కూడా సభ్యులకు వివరాలు తెలియజేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
