ఫిబ్రవరి 18న. జాబ్ మేళా నిర్వహణ……
-జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్….
సాక్షిత పెద్దపల్లి / నెల 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు టాటా మోటార్స్ & హుండాయ్ కంపెనీల్లో 40
సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఈ ఉద్యోగాల కొరకు విద్యార్హతలు ఐటిఐ, డిప్లమా, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏదైనా డిగ్రీ అర్హత, వయస్సు 19 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు ఉన్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని,
ఆసక్తి గలవారు ఫిబ్రవరి 18న. బుధవారం రోజు ఉదయం 11 గంటల నుంచి సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో నూతన కలెక్టర్ భవన సముదాయంలో, పెద్దకాల్వల పెద్దపల్లి మొదటి అంతస్థు రూమ్ నెంబర్. 233 వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 8985336947, 8121262441 ఫోన్ నెంబర్ నందు సంప్రదించాలని జిల్లా ఉపాధికల్పనాధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
