యువనాయకుడి పుట్టినరోజు వేళ ప్రజా నాయకుడి చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ…
129 – సూరారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కోల శ్రీకాంత్ ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని సూరారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం వారి స్వగృహం నందు నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు హాజరై కోలా శ్రీకాంత్ ముదిరాజ్ తో కేక్ ని కట్ చేయించిన ఎమ్మెల్యే గారు రానున్న రోజుల్లో ప్రజాసేవలో మరింత ముందుకు అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు కోల రవీందర్ ముదిరాజ్, గుబ్బల లక్ష్మీనారాయణ, మక్సూద్ అలీ, ఎర్వ సాయికిరణ్ (బంటి), నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY