రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు పోలింగ్ కేంద్రాల ను తనిఖీ….
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం…
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
జిల్లా కలెక్టర్*
సాక్షిత పెద్దపల్లి// రామగుండం .జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ హర్ష మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో జ్యోతి నగర్ టిటిఎస్ జడ్.పి.హెచ్.ఎస్, పిటిఎస్ ఎన్టిపిసి ఎస్.టి క్లెయిర్స్, గౌతమ్ నగర్ లోని ప్రగతి పాఠశాల, రాంనగర్ లోని హాట్ హై స్కూల్, అమరావతి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మధ్యాహ్నం మూడు గంటల వరకు లక్షా 01 వేయి 470 మంది (56.49) శాతం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అన్నారు.
ఉదయం 9 గంటల వరకు 9.5%, 11 గంటలకు 24.31%, 1 గంట వరకు 42.12% పోలింగ్ నమోదైందని, 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్న ఓటర్లకు టోకెన్ అందించి, ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు.
పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను పటిష్ఠ భద్రతతో స్ట్రాంగ్ రూం కు తరలించే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట రామగుండం తహసిల్దార్ ఈశ్వర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY