ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఆయన స్థానిక కృష్ణానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వార్డు నంబర్–14, పోలింగ్ స్టేషన్ నంబర్–49 వద్ద ఓటు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక స్వపరిపాలనలో భాగస్వాములై ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY