మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై పకడ్బందీగా నిఘా….
ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవు…..
2 టౌన్ పిఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ ప్రసాదరావు…
సాక్షిత పెద్దపల్లి// మున్సిపల్ కార్పొరేషన్ఎన్నికల సందర్భంగా ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా,స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు .గోదావరిఖని 2 టౌన్ పిఎస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ ప్రసాదరావు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేందకు చెక్‌పోస్టులు, వీడియో సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అక్రమ మద్యం కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై పోలీస్ నిఘా నిరంతరం ఉంటుందని తెలిపారు.
ఎవరైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించినా, డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తేదీ:09.ఫిబ్రవరి.2026 సోమవారం 05:00 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా అమలు చేస్తున్నామని,ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల నియమావళిని గౌరవించి శాంతియుత ఎన్నికలకు సహకరించాలని కోరారు.
ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తులు సోమవారం సాయంత్రం ఐదు గంటలలోపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఖాళీ చేసి వెళ్లాల్సింది గా ఆదేశిస్తున్నాం.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్లు ఉత్సాహంగా ముందుగానే పోలింగ్ స్టేషన్ చేరుకొని వాళ్ళ ఓటు హక్కు వినియోగించు కోవాల్సిందిగా పట్టణ వాసులందరికీ తెలియజేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY