ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శివమ్మా కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు కాలనీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జక్కుల నరసింహ ని మరియు సభ్యులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ శాలవతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శివమ్మా
కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని, ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళాలో అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్. జక్కుల నరసింహ, వైస్ ప్రెసిడెంట్. గుంతమల్ల గిరి, జనరల్ సెక్రెటరీ అంకిడి సతీష్, జాయింట్ సెక్రెటరీ ఓట్టుకుల తిరుపతి రాజ్, ఆర్గనైజర్ సెక్రటరీ జింకల కృష్ణయ్య, ఆర్గనైజర్ జాయింట్ సెక్రెటరీ
జక్కుల చిన్నఅంజి, ట్రెజరర్. బాచుపల్లి రామచంద్రర్, అడ్వైజర్స్ ఎన్ సిద్దయ్య, కాయిత నర్సిములు, మన్యం, ఆదినారాయణ, డి. రాజశేఖర్ చారి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్
బుచ్చయ్య, గోవింద్ నవీన్ కుమార్, జక్కుల శేఖర్, కె .కృష్ణ, ఎస్. దుర్వాసులు, రమేష్, మోహన్ నాయక్, సురేష్, బి కృష్ణ, యం. సురేష్, నీలా రావు, బాలాపీర్, తిరుపతిరావు, రాములు, యం. రాజు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY