రియో కిడ్స్ స్కూల్ ను ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||
….
సాక్షిత: (కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ పరిధిలోని సింహపురి కాలనీ లో మాలాశ్రీ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసుకున్న రియో కిడ్స్ స్కూల్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి *.
ఈ సందర్బంగా హన్మంతన్న మాట్లాడుతూ పిల్లల తొలి అడుగు ప్రస్తుత యుగంలో, ప్లే స్కూల్ అనేది పిల్లలు బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేసుకునే మొదటి మెట్టు. ఇది వారి సామాజిక, భావోద్వేగ మరియు మానసిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తుంది. పిల్లలు తమ ప్రయాణాన్ని ఆనందంగా ప్రారంభించే ఈ దశలో, పెద్దలు—ప్రత్యేకంగా పెద్ద పిల్లలు—తమ ప్రవర్తనతో చిన్నవారికి ఆదర్శంగా నిలవాలి.
ఈ విశిష్ట సందర్భంలో, మమ్మల్ని ఉత్సాహపరిచే విధంగా పిల్లల భవిష్యత్తును మలిచే ప్రయత్నం చేస్తున్న యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్, సింహపురి కాలనీ అధ్యక్షులు చిట్ల నరసింహారెడ్డి, జనరల్ సెక్రటరీ అశోక్ రెడ్డి, ఎమ్. సంతోష్ రెడ్డి, 130 డివిజన్ అధ్యక్షులు సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హరి కిరణ్ పటేల్, చందు, సంజీవ రెడ్డి, అంజాద్ , జానీ, మణి, అజ్జు, మున్నా పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
