అల్విన్ కాలనీ డివిజన్ సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోనిఅల్విన్ కాలనీ ఫేస్ 2, చక్రదారి నగర్, కాకతీయ కాలనీ, వెంకటపాపయ్య నగర్, కేటీఆర్ కాలనీ, జయశంకర్ కాలనీ, పీజేఆర్ నగర్ ఫేస్ 1, మరియు పీజేఆర్ నగర్ ఫేస్ 2, వెల్ విషర్ కాలనీలలోని పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల పై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎమ్.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పాదయాత్ర చేస్తూ పర్యటించిన కాలనీలలో కొంతమేర డ్రైనేజీ మరియు సీసీ రోడ్లకు సంబందించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని, వాటిని శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాంక్షన్ చేయించి అతి త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. కాలనీలలో కొన్నిచోట్ల డామేజ్ అయిన మన్ హోల్ మూతలను వెంటనే మర్చి కొత్తవి అమర్చాలని సంబంధిత అధికారులకు తెలియచేసారు. కాలనీలలో స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ ఓవర్ ఫ్లో, పారిశుధ్యనికి సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు కార్పొరేటర్ కి వివరించగా, కార్పొరేటర్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీ వాసులు తెలియచేసిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. డివిజన్ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, కాలనీలో పెండింగ్లో ఉండి అసంపూర్తిగా మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
జి.ఎచ్.ఎమ్.సి అధికారులు ఎస్.ఆర్.పి నాగేశ్వర నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, UBD నాగరాణి, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, వాటర్ వర్క్స్ సూపర్వైజర్లు శ్రీనివాస్ మరియు శివ, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY