గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ….
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జిగా నియమితులైన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీలోని లోని 2,5,6మరియు 17,20 వార్డులలో పార్టీ అభ్యర్థులు [షహనాజ సమీర్, సారిక, నవ్యశ్రీ, చంద్రమౌళి, వంటేరు కొండల్ రెడ్డి ] కు మద్దతుగా స్థానిక గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు…
ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేయాలని సూచించారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సన్న బియ్యం, ఉచిత కరెంటు, రైతు భరోసా, ఉచిత బస్సు వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి స్థానిక కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులకు తెలియజేశారు….
ఈ కార్యక్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY