రేపటి నుంచి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
** నేడు అంకురార్పణ ఘట్టం
** రేపు వైభవంగా ధ్వజారోహణం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం (నేడు) సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఆదివారం (రేపటి) నుంచి మార్చి 17వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అంకురార్పణం సందర్భంగా సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ తరువాత సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహిస్తారు.
- ధ్వజారోహణం :*
ఆదివారం ఉదయం 6.05 గంటలకు మకర లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పురవీధుల్లో వాహన సేవలు నిర్వహిస్తారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY