బేతవోలులో మెగా ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం…. ప్రారంభకులు సర్పంచ్ వట్టికూటి నాగయ్య…
సాక్షిత : చిలుకూరు మండలం బేతవోలులో కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు నిర్వాహాకులు..
స్వర్ణ భారతీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఐ కంటివైద్యశాల సూర్యపేట వారి సహాకారంతో మండలంలోని బేతవోలు ప్రాధమిక పాఠశాలలో గురువారం ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరంను ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిభిరంను గ్రామ సర్పంచ్ వట్టికూటి నాగయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉచితంగా కంటి వైద్య శిభిరం నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేయడం హర్షనీయం అన్నారు. వైద్య పరీక్షలలో ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లుగా నిర్వాహాకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహాకులు ఒరగంటి కిట్టు, ఉప సర్పంచ్ ఇట్టిమళ్ల ఏడుకొండలు, ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామనర్సయ్య, స్వర్ణ భారతీ ట్రస్ట్ అధ్యక్షులు నీలా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చారుగండ్ల ప్రవీణ రాజశేఖర్, డాకర్టు, వైద్య సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY