మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ…
సాక్షిత పెద్దపల్లి : రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్ల్స్ హై స్కూల్‌లోని 59,60 డివిజన్ల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌తో కలిసి ప్రత్యక్షంగా సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అక్కడి పరిసరాలను సమీక్షించి,శాంతి భద్రతల పరంగా తీసుకోవాల్సిన పలు సూచనలను గుర్తించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా అవసరమైన అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.
ప్రజలు భయభ్రాంతులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించే వాతావరణం కల్పించడానికి, పోలింగ్ రోజు ఎలాంటి అక్రమాలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఓటరు భయభ్రాంతులు లేకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీస్ తరపున అన్ని భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, చట్టవిరుద్ధ చర్యలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.స్థానిక ప్రజలకు,అన్ని పార్టీల కార్యకర్తలకు శాంతి భద్రతలు, చట్టపరమైన నిబంధనలు,ప్రవర్తనా నియమావళిని పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY