నందిగామలో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం ప్రారంభం..
జిల్లా పరిషత్ హై స్కూల్‌లో విద్యార్థులకు కంటి పరీక్షలు – దృష్టిలోపం ఉన్న వారికి కళ్లజోళ్ల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ..
నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో గురువారం జాతీయ అంధత్వ మరియు దృష్టిలోప నివారణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉన్న విద్యార్థిని-విద్యార్థులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య రెండూ సమానంగా ముఖ్యమని, ముఖ్యంగా దృష్టి లోపం కారణంగా చదువులో వెనుకబడకుండా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, కూటమి నేతలు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ మల్లెపాక శ్రీనివాసరావు, హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వైద్యులు, కూటమి నాయకులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY