సమర్ధులనే ఎన్నుకోండి.
సీఎం సురేష్.
….
అలంపూర్ సాక్షిత :
ప్రజలను మభ్యపెట్టే పార్టీలు నమ్మవద్దని సమర్థులకే పట్టం కట్టాలని, సీఎం సురేష్ ఓటర్లకు తెలియజేశారు.
అలంపూర్ తాలూకా ఐజ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి సీఎం సురేష్ పలు వార్డులలో భారీ ర్యాలీ తో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఓటర్లతో మాట్లాడుతూ,
కాంగ్రెస్ పార్టీ వట్టి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తుందని, ఎన్నికల ముందు మాత్రమే హామీలు ఇస్తూ, ఇంతకుముందు ఇచ్చిన హామీలను అమలు పరచలేక, ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులని ఎట్టి పరిస్థితిలో నమ్మవద్దని, మీ ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఈ సందర్భంగా సురేష్ చెప్పారు.
మొత్తం 20 వార్డులలో టిఆర్ఎస్ అభ్యర్థులను అత్యధికమే మెజారిటీతో గెలిపించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా సురేష్ తెలియజేశారు.
కార్యక్రమంలో మల్లికార్జున్రెడ్డి, నాగర్ దొడ్డి వెంకటరములు,పల్లయ్య, దేవరజయన్న, పాగుంట అశోక్, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY