టిడిపి ఎంపీలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు
హాజరైన ఎంపీలు కేశినేని, వేమిరెడ్డి , తెన్నేటి, మాగుంటి, బైరెడ్డి
తొలిసారి సభకు వచ్చిన వారికి ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఎంపీలు విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన లోక సభ స్పీకర్ ఓంబిర్లా
ఢిల్లీ : లోక సభ స్పీకర్ ఓంబిర్లా పార్లమెంట్ లోని తన కార్యాలయంలో సాయంత్రం టిడిపి ఎంపీలకు ఇచ్చిన తేనీటి విందుకు బాపట్ల ఎంపీ లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి ప్రసాద్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసులు రెడ్డి, నంధ్యాల ఎంపీ బైరెడ్డి శబరి లతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓంబిర్లాను టిడిపి ఎంపీలు శాలువాతో ఘనంగా సత్కరించారు.
అనంతరం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా టిడిపి ఎంపీలతో సమావేశమై వ్యక్తిగతంగా వారితో వివిధ అంశాలపై చర్చించారు. అలాగే సభా కార్యకలాపాలు ఇంకా బాగా జరిగేందుకు ఎంపీ ల వద్ద నుంచి స్పీకర్ ఓంబిర్లా సలహాలు, సూచనలు తీసుకున్నారు. తొలిసారి పార్లమెంట్ కి వచ్చిన ఎంపీల అనుభవాలు అడగటంతో పాటు, తమ వైపు నుంచి కావాల్సిన మద్దతు గురించి అడిగి తెలుసుకున్నారు. తొలిసారి లోక్ సభకు వచ్చిన వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని తామంతా కలిసి చేసిన విజ్ఞప్తికి స్పీకర్ ఓంబిర్లా సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY