మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మారుతి, విఠల్ నగర్‌లో ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్స్ మీటింగ్…
సాక్షిత పెద్దపల్లి//రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతినగర్ 60వ. డివిజన్, విఠల్ నగర్ 12వ.డివిజన లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ…. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఎన్నికల కోడ్‌ను పాటించాలి, గొడవలు, సోషల్ మీడియా లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సందేశాలు చేయడం, వ్యక్తిగత దుషణలు, అక్రమ, అసత్య ప్రచారం చేయరాదని సూచించారు.
ప్రభుత్వం కార్యాలయాలకు, దేవాలయాలకు, మసీద్ లకు ఎలాంటి వాల్ పోస్టర్స్ అంటించడం, వాల్ రైటింగ్ రాయడం చట్టరీత్యా నేరం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు.
మీ డివిజన్ పరిధిలో ప్రైవేట్ ఇంటి గోడలపై ప్రచారం కి సంబందించిన వాల్ పోస్టర్స్ అంటించడం, వాల్ రైటింగ్ రాయడం చేస్తే ఇంటి యజమాని అనుమతి తీసుకోవాలి.
ప్రచారం 6:00 to రాత్రి 10:00 గంటలకు ముగించాలి. మైక్ ఉపయోగిస్తే తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి.
ప్రచారం చేసే సమయంలో ర్యాలీ లకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. ర్యాలీ సమయం తెలిపినచో అందరూ అభ్యర్థులకు అవకాశం కల్పించేలా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనియా సంఘటనలకు తావులేకుండా భద్రత చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.
పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల కు 100మీటర్లు దూరం లో ఉండాలి, కేంద్రం వద్ద కండువాలు ధరించి ప్రచారం చేయకూడదు. గుంపులు గుంపులుగా ఉండకూడదు.
ఓటు వేయడానికి వెళ్లే సమయంలో మొబైల్ ఫోన్ పోలింగ్ కేంద్రం లోకి తీసుకెళ్ల కూడదు.
ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు ఎవరిని కించపరిచే విధంగా, అసభ్యకరంగా మాట్లాడకూడదు. ప్రజలు గెలిపించి ఇచ్చిన అవకాశంను ప్రజా సమస్యల గురించి, అభివృద్ధి గురించి అందరితో కలిసి పనిచేయాలి అన్నారు.
ఫిబ్రవరి 16 వ తేదీ వరకు ఎన్నికలు కోడ్ ఉంటుంది కనుక ఎలాంటి విజయోత్సవ ర్యాలీ లు టపాకాయలు కాల్చడం చేయకూడదు.
ప్రతి ఒక అభ్యర్థి వారి వారి అనుచరులకు ముందస్తు ఆదేశాలు, హెచ్చరికలు చేస్తూ, వారిని గమనిస్తూ ఉండాలి అని ఎవరైనా అనుచరులు ఎన్నికల నియమాల ఉల్లంఘనలకు పాల్పడితే, అభ్యర్థుల పై కూడా చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
అలాగే ఎలాంటి సమస్యలు ఎదురైన వెంటనే పోలీస్ కు, ఎన్నికల అధికరులకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ఎన్నికలు శాంతియుతంగా నిర్భయంగా, నిబద్దత తో నిర్వహించేలా, ప్రజలు అభ్యర్థులు పోలీస్ సహకరించగలరు ఎన్నికల నిర్వహణ కి అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ డివిజన్ మీటింగ్‌లో ఎస్ఐ రమేష్, అనూష, స్థానిక కాలనీ వాసులు, ప్రజాప్రతినిధులు, క్రైమ్ సిబ్బంది, బ్లూ క్లోట్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY