ఇంటి దొంగతనాలకు పాల్పడే ముఠా అరెస్ట్ -రూ. 36, లక్షల దొంగ సొత్తు స్వాధీనం
గత సంవత్సరం డిసెంబర్ నెల 21 వ తేది న యర్రగుంట్ల మండలం, చిలమకూరు గ్రామం లో నివాసం ఉన్న సదరు గ్రామం నందు నాలుగు రోడ్ల కూడలిలో కిరాణ దుఖానం నడుపుకొంటూన్న దుద్దే రమేష్ శెట్టి అను అతని ఇంటి నందు అక్రమంగా ప్రవేశించి బీరువా లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగలించిన దొంగలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి దొంగ సొత్తు ను ఎర్రగుంట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వై. ఎస్ ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ. పి ఎస్ మీడియా కు వివరాలు తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
స్వాధీనం చేసుకొన్న దొంగ సొత్తు మరియు నేరానికి ఉపయోగించిన వస్తువుల వివరాలు: (సుమారు రూ. 36 లక్షల విలువ)
స్వాధీనం చేసుకొన్న దొంగ సొత్తు
సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలు
సుమారు 60 వేలు విలువ గల I-Phone.
నేరానికి ఉపయోగించిన వస్తువుల
ఒక కట్టింగ్ మిషన్
మూడు సెల్ ఫోన్లు
కేసులో ఇద్దరు ముద్దాయిలు మరియు ఇద్దరు బాల నేరస్థులు అరెస్ట్.
యేట్టి విజయ్ పాల్, వయసు: 19 Yrs, తండ్రి: చంద్ర పాల్, కులం: SC Mala, వృత్తి: సప్లయర్ వ్యాపారం, నివాసం: సిర్రాజుపల్లె రోడ్డు, చిలమకూరు గ్రామం, యర్రగుంట్ల మండలం, YSR కడప జిల్లా, (A1)
షేక్ గైబు వల్లి, వయసు: 19 Yrs, తండ్రి: మహబూబ్, కులం: ముస్లిం, వృత్తి: కూలి, నివాసం: పాత ఊరు, చిలమకూరు గ్రామం, యర్రగుంటల మండలం. (A2)
నేర విధానం (మోడ్ ఆఫ్ ఆపరేషన్):
ముద్దాయిలు చదువు మానేసి, చెడు వ్యసనాలకు బానిసై జులాయి గా తిరుగుతూ జన సంచారం తక్కువ ఉన్న ప్రాంతాలలో గత కొంత కాలంగా గ్రామం నందు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నట్లు, అనంతరం ముద్దాయిలు ముదస్తూ పథకంలో భాగంగా కుట్ర పన్ని గత కొద్ది రోజులుగా నాలుగు రోడ్ల కూడలిలో కిరాణ దుకాణం నడుపుకొంటూన్న దుద్దే రమేష్ శెట్టి, కుటుంబ సభ్యుల కదలికలు మరియు ఇంటిని గమనిస్తూ, పిర్యాది అంగడి వద్ద ఉండగా, సుమారు 4.00 PM గంటల సమయంలో పిర్యాది బందువులు ఇంటికి రాగా, వారితో పాటు పిర్యాది అమ్మ ఊరుకి వెళ్ళగా, పిర్యాది భార్య ఇంటికి తాళం వేసి అంగడి వద్దకు వెళ్ళగా, గత కొన్ని రోజుల నుండి గమనిస్తున్న వీరు ఇదే అధునుగా భావించి గత సంవత్సరం డిసెంబర్ నెల 21 వ తేది న రాత్రి సుమారు 7.00 నుండి 7.30 గంటల సమయంలో యర్రగుంట్ల మండలం, చిలమకూరు గ్రామం నందు రోడ్డు పై ఒక బాల నేరస్తుడు సదరు ఇంటి యజమానుల మరియు సదరు ఇంటి వైపు వచ్చే వారి కదలికలు గమనిస్తూ ఉండగా, పైన తెలిపిన ఇద్దరు ముద్దాయిలు మరియు మరొక బాల నేరస్థుడు పిర్యాది ఇంటి తలుపుల గడియను బండలను కట్ చేసే కట్టింగ్ మిషేన్ ఇంటి బయట ఉన్న కరెంట్ ప్లగ్ ద్వార కరెంట్ సప్లై ఇచ్చి, దాని ద్వార కట్టింగ్ చేసి, ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలించినారు.
అరెస్టు వివరాలు:
యర్రగుంట్ల మండలం, చిలమకూరు గ్రామం నందు జరిగిన రాత్రి సమయంలో జరిగిన కన్నపు నేరం విచారణలో కడప జిల్లా SP సార్ గారి ఆదేశాల మేరకు, జమ్మలమడుగు DSP గారి పర్యవేక్షణలో యర్రగుంట్ల U/G PS Cr.No-389/2025 U/Sec 331(3), 305 BNS కేసు దర్యాప్తులో యర్రగుంట్ల పోలీస్ స్టేషన్ inspector of police, S.విశ్వనాథ రెడ్డి, Sub Inspector of Police శ్రీ B.Naga Murali మరియు సిబ్బంది HC-1981 అల్ఫ్రెడ్, HC-1197 T.ఓబులేసు, PC-1454 D.లక్ష్మి నారాయణ, PC-136 A.శివ ప్రసాద్, PC-2715 R.రామ చంద్ర, PC-2738 R.చంద్ర లు ప్రత్యేక బృందంగా ఏర్పడి రాబడిన సమాచారంతో వీరిని యర్రగుంట్ల మండలం, ముద్దనూరు – కడప మెయిన్ రోడ్డు పై నిడ్జి గ్రామం దాటినా తరువాత మాలేపాడు క్రాస్ వద్ద నిన్నటి దినం అరెస్ట్ చేసి., వారి వద్ద నుండి చోరి సొత్తు ను మరియురు. కడప ఎస్పి శ్రీ నచికేత్ విశ్వనాథ్, IPS గారు ఈ పోలీసు బృందాలకు రివార్డ్ లు ఇచ్చి అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY