అంబర్ పెట్ డివిజన్ హైమద్ నగర్ లో సుమారుగా 14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులను అంబర్‌పేట్ నియోజకవర్గ MLA కాలేరు వెంకటేష్ ,అంబర్ పెట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్థానిక బస్తీ ప్రజలతో కలిసి హైమద్ నగర్ లో పర్యటించి స్థానికంగా ఉన్నటువంటి వీధి దీపాలు,విద్యుత్ కేబుల్ మరియు డ్రైనేజీ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడుతూ స్థానికంగా వీధిదీపాల సమస్య డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, అవసరమైన చోట వెంటనే విద్యుత్ కేబుల్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు,
ఎమ్మెల్యే మాట్లాడుతూ, హైమద్ నగర్ లో ఇప్పటికే అనేకచోట్ల నూతన డ్రైనేజీ లైన్లు,నూతన సిసి రోడ్లు,నూతన ఐ మాస్ లైట్లని ఏర్పాటు చేయడం జరిగిందని,అంబర్ పెట్ డివిజన్ లోనీ ప్రతి బస్తీ నీ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు జిఎం శ్రీధర్ రెడ్డి, డిజీఎం విష్ణువర్ధన్,ఎఇ ప్రదీప్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ,రమేష్,స్ట్రీట్ లైట్ సిబ్బంది మన్సూర్, సాయి,బీఆర్‌ఎస్ పార్టీ అంబర్ పెట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్,పార్టీ సీనియర్ నాయకులు,మహిళా నాయకులు,మైనార్టీ నాయకులు,స్థానిక బస్తీ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY