ప్రజా మద్దతుతో విజయం.
ఉప్పరి సునీతా బస్వరాజ్.
అలంపూర్ సాక్షిత :
అలంపూర్ తాలూకా ఐజ మున్సిపాలిటీలో ఎన్నికల సందర్భంగా, ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లతో మాట్లాడుతూ,
ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తాం అని అన్నారు.
ఐజ మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డ్ లో జోరుగా కొనసాగుతున్న ప్రచారం.
ఐజ పట్టణంలోని 11వ వార్డు నందు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పరి సునీత బసవరాజ్ ప్రచారం చేస్తూ
చదువుకున్న వ్యక్తిగా నన్ను గెలిపిస్తే కాలనీలో సీసీ రోడ్ల వ్యవస్థను, డ్రైనేజీ వ్యవస్థను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకారం తో కచ్చితంగా చేయిస్తామని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడికొండ లక్ష్మీ కాంతారావు స్వామి, ఆర్ శ్రీధర్ , బడే సాబ్ యువ నాయకులు కురువ వీరేష్, అనిల్ ,వెంకటేష్, భీమేష్, షఫీ ,శాలు అనిల్ మాసూమ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY