చిలకలూరిపేటలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
చిలకలూరిపేట: మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని 25వ వార్డు పరిధిలో గల పాటిమీద, జాగుపాలెం, బొందిలిపాలెం తదితర ప్రాంతాల్లో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.వార్డు కౌన్సిలర్, తోట నాగలక్ష్మి కూటమి పార్టీల ముఖ్య నాయకులు మరియు సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు అందుతున్న ఆర్థిక భరోసా పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సంక్షేమంలో మన రాష్ట్రమే ఆదర్శం
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తోట నాగలక్ష్మి, టీడీపీ 182వ బూత్ కన్వీనర్ & TNTUC నియోజకవర్గ అధ్యక్షుడు బోనం శ్రీనివాసరావు, మరియు జనసేన పార్టీ వార్డు ఇన్చార్జి చల్లా వెంకయ్య మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంతటి గొప్ప సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందనిపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఇటువంటి ప్రభుత్వాన్ని పొందడం రాష్ట్ర ప్రజల అదృష్టమనిపింఛన్ల పంపిణీ ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వారు గుర్తుచేశారు.అనంతరం నాయకులు మరియు కార్యకర్తలు “జై చంద్రబాబు”, “జై పవన్ కళ్యాణ్”, “జైజై ప్రత్తిపాటి” అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు. .

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
