జగదాంబ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ …
129 – సూరారం డివిజన్ శివాలయ నగర్ లోని శ్రీశ్రీశ్రీ జగదాంబ దేవాలయం 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. శ్రీశ్రీశ్రీ జగదాంబ (దుర్గాదేవి) అమ్మవారి కృపా కటాక్షాలు, సంపూర్ణ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థాన మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, దొడ్ల ఆంజనేయులు, ఫిరోజ్, కోలా శ్రీకాంత్ ముదిరాజ్, మక్సూద్ అలీ, దేవాలయ కమిటీ అధ్యక్షులు గోపాల్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి శంకర్ పవర్, సభ్యులు వి. లక్ష్మణ్ పవార్, ప్రసాద్ నాయక్, రాజేందర్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY