సమ్మక్క–సారలమ్మ’ ఆడియో–వీడియో సీడీ ఆవిష్కరణ
ఘనంగా ఆవిష్కరించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
పొట్టాల నాగరాజు కృషి అభినందనీయం
గోదావరిఖని,
గిరిజన వీరవనితలు, పౌరుషానికి ప్రతీకలైన సమ్మక్క–సారలమ్మల పోరాట గాథను నేటి తరానికి అందించేందుకు కళాకారులు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. బుధవారం సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. దుర్గం నగేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంచిర్యాల జిల్లాకు చెందిన వర్ధమాన కళాకారుడు పొట్టాల నాగరాజు రూపొందించిన ‘సమ్మక్క–సారలమ్మ’ ఆడియో–వీడియో సీడీని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిలో మేడారం జాతరకు, సమ్మక్క–సారలమ్మల పోరాట పటిమకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. కవిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ పాత్రలు పోషిస్తూ నాగరాజు ఈ పాటను అత్యంత అర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఎన్ఆర్సి (NRC) మ్యూజిక్ ఛానల్ ద్వారా విడుదలైన ఈ పాటను ప్రజలందరూ వీక్షించి ఆదరించి, కళాకారుడిని ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాడీ లోకేష్, కాంగ్రెస్ ఎన్టిపిసి పట్టణ అధ్యక్షులు ఆసిఫాస్, 34వ డివిజన్ అధ్యక్షులు బొడిగ భరత్ గౌడ్, సింగర్ చందుతో పాటు పలువురు కళాకారులు, నాయకులు పాల్గొన్నారు.
సాంస్కృతిక మాధ్యమాల ద్వారా ప్రజల చరిత్రను, పోరాటాలను భావితరాలకు చేరవేయడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని పలువురు అభిప్రాయపడ్డారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
