రాజకీయలకు అతితంగా గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్లు పని చేయాలి……
సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులుపలుస శంకర్ గౌడ్
సాక్షిత వనపర్తి :
నూతనంగా ఎన్నికైన ఆమడబాకుల గ్రామ సర్పంచ్ గాయత్రి అనిల్ ను వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడుతున్నారు గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం సర్పంచ్లు రాజకీయాలకు అతితంగా పనిచెయ్యాలన్నారు. గాంధీజీ కలలుకన్న స్వరాజ్యం తీసుకుని రావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలలో మహిళాల రిజర్వేషన్లు వల్ల మహిళలు రాజకీయ రంగంలోకి రావటం అభినందించదగ్గ విషయం అన్నారు.
ఈ కార్యక్రమం పెబ్బేర్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి , అనిల్,
తడితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
