అర్జున అవార్డు గ్రహీతకు గ్రూప్–1 ఉద్యోగం
** “శాప్” చైర్మన్ రవి నాయుడు ప్రకటన
సాక్షిత ప్రతినిధి – అమరావతి / తిరుపతి: రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రముఖ అంతర్జాతీయ అథ్లెట్… అర్జున అవార్డు గ్రహీత ఎర్రజి జ్యోతికి గ్రూప్–I ఉద్యోగంతో పాటు విశాఖపట్నంలో 500 గజాలు ఇంటి స్థలం మంజూరు చేయడాన్ని ఆమోదించడం జరిగిందని “శాప్” చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు.
రవి నాయుడు మాట్లాడుతూ క్రీడల పట్ల దూరదృష్టితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, అలాగే శాప్ కలిసి క్రీడాకారుల సంక్షేమం, అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్నాయని అన్నారు.
క్రీడాకారులు దేశానికి, రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఎర్రజి జ్యోతికి పెద్ద అన్నయ్యలా అండగా నిలిచి ప్రతి దశలో ప్రోత్సహించిన ఐటీ, హెచ్ఆర్డి శాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు.
ఈ నిర్ణయం ద్వారా క్రీడాకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, శాప్ అండగా ఉంటాయని మరోసారి స్పష్టమైందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎర్రజి జ్యోతికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు, అలాగే రాష్ట్ర క్యాబినెట్ సభ్యులందరికీ “శాప్” చైర్మన్ రవినాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
