యువగళం పాదయాత్ర “పెద్ద గేమ్ చేంజర్”
** రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేసింది
** మీడియాతో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: తెలుగుదేశం పార్టీ యువకెరటం, రాష్ట్ర మంత్రి నారాలోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమై మూడు ఏళ్ళు పూర్తయింది. ఆ పాదయాత్ర రాజకీయాల్లో పెద్ద గేమ్ చేంజర్ గా మారిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ స్పష్టం చేశారు. 2023 జనవరి 27వ తేదీన కుప్పంలో నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో మొదటి అడుగు వేసారని…
దీంతో రాష్ట్ర రాజకీయాలలో ఒక యువనాయకుడు మొదలయ్యాడనే భరోసా కలిగిందన్నారు. ఆ యాత్ర పూర్తయ్యేనాటికి ఒక మహా ప్రభంజనమయ్యాడు.
97 శాసన సభ నియోజక వర్గాలు, 232 మండలాలు/ మునిసిపాలిటీలు , 2097 గ్రామాలు మీదుగా 226 రోజులు 3132 కిలోమీటర్లు కొనసాగింది. నాటి జగన్ రెడ్డి అరాచక పాలనలో యువగళం పాదయాత్రకు అడుగడుగునా పోలీసు లతో అడ్డంకులు… జీఓ -1 పేరుతో పోలీసులతో పెట్టించిన అక్రమ కేసులు , మైకులు లాగేసుకుంటూ దారిలో ప్రజలతో మాట్లాడకుండా అడ్డుకుంటూ నీచ రాజకీయాలు చేయడం , వ్యక్తిత్వ హననం చేయడం లాంటి అణచివేతలకు గురిచేసినా పట్టుదలతో , దృఢ సంకల్పంతో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసి “దటీజ్ లోకేష్” అని ప్రత్యేక గుర్తింపు పొందారు.
పాదయాత్ర మొదట్లోనే తన సన్నిహిత బంధువు నందమూరి తారక రత్న అకాల మృతి… తర్వాత తన తండ్రి నారా చంద్రబాబును తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఆత్మస్తైర్యం కోల్పోకుండా పాదయాత్రను కొనసాగించిన యువ కెరటంగా నిలిచారు లోకేష్.
రాష్ట్రంలో నాటి జగన్మోహన్ రెడ్డి అరాచక , దోపిడీ పాలన పతనానికి నాంది పలికి గట్టి పునాదులు వేసింది నారా లోకేష్ యువగళం పాదయాత్ర.
పాదయాత్ర జరిగిన 97 నియోజక వర్గాలలో 90 నియోజక వర్గాలలో కూటమి అభ్యర్థులు గెలిచారని సురేంద్ర కుమార్ గుర్తు చేశారు. ఇది కేవలం ఒక నాయకుడి పాదయాత్ర కాదు…రాష్ట్ర భవిష్యత్తును మార్చిన ఒక మహా సంకల్పం. ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి , రాష్ట్రానికి , ప్రజలకు ఒక మంచి భవిష్యత్తు నాయకుడిని పరిచయం చేసింది. ఈ పాదయాత్రతో పార్టీలో ఒక నాయకుడిగా మొదలై పూర్తి అయ్యేసరికి ఒక సమర్ధవంతమైన నాయకుడిగా, గట్టి నాయకుడిగా టిడిపిలో, ఇతర పార్టీలలో , ప్రజలలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఉద్యోగాలు , ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో ఎదురు చూస్తుండిన యువతలో భద్రత… రక్షణ కరువైన మహిళలు , బాదుడే బాదుడు తో బ్రతుకు భారంగా మారి సామాన్య , మధ్యతరగతి ప్రజలకు భవిష్యత్తుపై ఒక భరోసా , మళ్ళీ మంచి రోజులు వస్తాయిలే అనే నమ్మకం , దైర్యం కల్పించింది యువగళం పాదయాత్ర. యువగళం సారధి నారా లోకేష్ విజయవంతం కాడడం కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒకరికి అభినందనలు… కృతఙ్ఞతలు అని సురేంద్ర కుమార్ పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY