తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ 2026 డైరీ ఆవిష్కరణ
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం 27-01-2026, మంగళవారం సాయంత్రం 3.00 గంటలకు, హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని HMWSSB పరిపాలనా భవనంలో జరిగినది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం. బి కృష్ణ యాదవ్, కార్యదర్శి ఎం.ఏ.అబ్దుల్ ఖాదర్ గారి అధ్యక్షతన శ్రీ.కె.అశోక్ రెడ్డి ఐ.ఏ.ఎస్, ఎం.డి, మయాంక్ మిట్టల్ ఐ.ఏ.ఎస్, ఈ.డి HMWSSB మరియు టి.జి.వో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీ. బి.శ్యామ్ గారి చేతుల మీదుగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జయప్రదంగా జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ బ్రాంచ్‌కు కార్యాలయ భవనం కొరకు స్థలం కేటాయింపు, టి జి వో హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ అధికారులకు కొరకు జి.ఎచ్.ఎం.సి పరిధిలో గృహ నిర్మాణ స్థలం కోరడం జరిగినది. రాష్ట్ర ఉద్యోగ సమాజం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంప్లాయ్ హెల్త్ స్కీం వెంటనే అమలు అయ్యేలా యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేసారు.
ఇట్టి కార్యక్రమంలో సెంట్రల్ అసోసియేషన్ ట్రెజరర్ ఎస్.సహదేవ్, కోటాజీ, షౌకత్, లక్ష్మణ్ గార్లు, హైదరాబాద్ జిల్లా టి.జి.వో సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ జి.ఆశన్న, ట్రెజరర్ మడుగూరి వెంకటరమణ, మహిళా అధ్యక్షురాలు ఎస్.ఎంజుల రెడ్డి , సంయుక్త కార్యదర్శులు డాక్టర్.క్రొత్త విద్యా సాగర్, మంచాల రవిందర్, పి.పెరయ, డాక్టర్.సునీత జోషి, ఎం.డి. గౌస్, పబ్లికేషన్ సెక్రెటరీ శ్రవణ్ రెడ్డి, ఆఫీస్ సెక్రెటరీ, గోపాలకృష్ణ, కార్యనిర్వాహక సభ్యులు టి.వి సరస్వతి, డాక్టర్.సాయిబాబా, బి .జ్యోతి, సి.జి.ఎం.చంద్రజ్యోతి, సిటీ, వివిధ జిల్లాల ఆఫీస్ బేరర్స్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ బ్రాంచ్ యొక్క ప్రాథమిక సభ్యులందరూ కార్యక్రమానికి పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY