37 వ అంతర్జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా స్థానిక ఆర్టీవో ఆఫీస్ నందు పీలేరు పరిసర ప్రాంత వాసులకు కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన చూపు కోసం కళ్ళ అద్దాలు పంపిణీ చేయడం జరిగినది. గతవారం లైన్స్ క్లబ్ మరియు రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్ అయిన షి సంస్థ వారు పాల్గొని లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది వారికి అందరికీ స్థానిక మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ టి విజయ్ కుమారి తన సొంత ఖర్చులతో కంటి అద్దాలు సమకూర్చడం జరిగింది.
ఈ కార్యక్రమం నందు రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్ షీ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి వి ఎస్ లక్ష్మి మరియు న్యాయ సలహాదారు డాక్టర్ రాయల సుధాకర్ రాయలు అలాగే కార్యాలయ సిబ్బంది రవి పృథ్వి భాష మరియు ప్రజలు విరివిగా పాల్గొన్నారు సహృదయంతో లబ్ధిదారులకు కంటి అద్దాలు సమకూర్చినందుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్
టి.విజయ్ కుమారి ని మరియు పీలేరు లైన్స్ క్లబ్ వారిని అందరూ ప్రశంసించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY